బ్రాండ్ బాబు ట్రైల‌ర్ విడుద‌ల చేసిన చైతూ 

సుమంత్ శైలేంద్ర ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం బ్రాండ్ బాబు.  తెలుగ‌మ్మాయి ఇషా రెబ్బా ఈ చిత్రంలో క‌థానాయిక‌. మారుతి క‌థ అందించి, ఆయ‌నే స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ఈ చిత్రాన్ని పార్కీ ప్ర‌భాక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్ర ట్రైల‌ర్ ను అక్కినేని నాగ చైత‌న్య విడుద‌ల చేశారు.

అనంతరం నాగ‌చైత‌న్య సినిమా గురించి మాట్లాడుతూ.. సుమంత్ శైలేంద్ర‌ను తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఆహ్వానించారు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని ఆక‌ట్టుకుంద‌ని.. మారుతి కామెడీ టైమింగ్ చాలా చోట్ల క‌నిపించింద‌ని చెప్పారు. ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ కూడా క‌నిపించింద‌ని చెప్పారు నాగ‌చైత‌న్య‌. సుమంత్, ఇషారెబ్బాకు ఈ చిత్రం విజ‌యం తీసుకురావాల‌ని కోరుకున్నాడు నాగ‌చైత‌న్య‌.
ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. నాగ‌చైత‌న్య మా చిత్ర ట్రైల‌ర్ ను లాంఛ్ చేయ‌డం.. ఆయ‌న నచ్చింద‌ని చెప్ప‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. ఆగ‌స్ట్ 3న బ్రాండ్ బాబు విడుద‌ల కానుంద‌ని.. క‌చ్చితంగా ప్రేక్ష‌కులకు కూడా ఈ చిత్రం న‌చ్చుతుంద‌ని చెబుతున్నాడు ప్రభాక‌ర్.

హీరోయిన్ ఇషారెబ్బా మాట్లాడుతూ.. నాగ‌చైత‌న్య ట్రైల‌ర్ విడుద‌ల చేసినందుకు థ్యాంక్స్ చెప్పింది. ప్రేక్ష‌కుల‌ను త‌మ సినిమా క‌చ్చితంగా అల‌రిస్తుంద‌ని చెప్పింది ఇషా. బ్రాండ్ బాబులో ముర‌ళి శ‌ర్మ‌, పూజిత పొన్న‌డ‌, రాజా రవీంద్ర‌, స‌త్యం రాజేష్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శైలేంద్ర నిర్మాణంలో వ‌స్తోన్న ఈ చిత్రానికి జేబీ సంగీతం అందిస్తున్నాడు.

న‌టీన‌టులు: సుమంత్ శైలేంద్ర‌, ఇషారెబ్బా, ముర‌ళి శ‌ర్మ‌, పూజిత పొన్న‌డ‌, రాజా ర‌వీంద్ర‌, స‌త్యం రాజేష్, వేణు వై, న‌లిని, సాయికుమార్ పి, కోటేశ్ మ‌న్న‌వ‌, కిర‌ణ్..

టెక్నిక‌ల్ టీం: క‌థ‌: మారుతి, ద‌ర్శ‌కుడు: ప‌్ర‌భాక‌ర్ పి, నిర్మాత‌: ఎస్ శైలేంద్ర‌, బ్యాన‌ర్: శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్, సంగీతం: జేబి, లిరిక్స్: పూర్ణాచారి, డిఓపి: కార్తిక్ ఫ‌ల‌ని, ఎడిట‌ర్: ఉద్ధ‌వ్ ఎస్ బి, ఆర్ట్ డైరెక్ట‌ర్: ముర‌ళి ఎస్ వి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here