బైక్ పై వచ్చిన సాయి పల్లవి.. రాకుండా ఉండిపోయిన నాగశౌర్య.. గొడవలే కారణమా..!

సాయి పల్లవి హీరోయిన్ గా తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన కణం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో హీరోగా నాగ శౌర్య నటిస్తున్నాడు. కణం తమిళంలో కరు పేరుతో రిలీజవనుంది. అభినేత్రి ఫేం ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ ఈవెంట్ కు సాయిపల్లవి బైక్ లో రాగా.. నాగశౌర్య కనీసం హాజరు కూడా కాలేదు. హీరో హీరోయిన్ల మధ్య గొడవలు ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇటీవల్ ఛలో మూవీ ప్రమోషన్స్ లో కూడా తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన హీరోయిన్ సాయి పల్లవే అని చెప్పాడు కూడానూ.. అనుకున్నట్లుగానే ‘కణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నాగ శౌర్య హాజరు కాలేదు.


సాయి పల్లవి బైక్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చేరుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె బయలుదేరబోయే సమయానికి విపరీతంగా ట్రాఫిక్ జామ్ కావడంతో తన అసిస్టెంట్ బైక్ ఎక్కి వెనుక కూర్చుని ఈవెంట్ జరిగే ప్లేసుకు వచ్చేసింది. ఆమె సింప్లిసిటీకి ఈవెంట్ కు వచ్చిన వారినుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే నాగశౌర్య రాకపోవడంపై కూడా పలు వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here