తప్పు చేస్తే.. నేను తప్పు చేశాను అని బహిరంగంగా ధైర్యంగా చెప్పుకొనే వాడు.. పవన్ కళ్యాణ్..!

ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ విషయమై చేసిన ఆరోపణలు, క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై నాగబాబు స్పందించారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పవన్ కళ్యాణ్ ను అనడం చాలా తప్పు అని.. అలాగే ఇండస్ట్రీలో అందరూ చెడ్డోల్లే లేరని చెప్పుకొచ్చారు. ఒకరి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించే హక్కు వారికి ఎవరిచ్చారని నాగబాబు ఎదురు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై కొందరు అనవసరంగా పని గట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు నాగబాబు.

అవగాహన లేనివాళ్లు ‘మా’పై అనేక రకాలుగా మాట్లాడుతున్నారని నాగబాబు అన్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మాతలు సరిగా పేమెంట్లు చేయకపోతే మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. ‘మా’ ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని, సభ్యత్వ రుసుం అవసరమన్నారు. 900 మంది ఉండే బలమైన అసోసియేషన్‌ మా అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఓ భాగమే సినీ పరిశ్రమ అని.. విభిన్నంగా ఉండదని అన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కోర్టుకు వెళ్లవచ్చన్నారు. చర్యలు తీసుకునే అధికారం ఫిల్మ్ చాంబర్‌కు లేదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో మార్పు రావడానికి కొంత సమయం పడుతుందన్న ఆయన కొంతమంది వెధవల వల్ల పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. ఇలాంటివి తన దృష్టికి వస్తే ఒకరిద్దరిని చెప్పుతో కొట్టానని తెలిపారు. తప్పు చేసినవాళ్లను చెప్పుతో కొట్టి.. పోలీసులకు పట్టించండి అంటూ పిలుపును ఇచ్చాడు.

నా తమ్ముడు నాతో మాట్లాడి కనీసం ఆరు నెలలైంది. నేను డిస్ట్రబ్ చేయడం లేదు. వెళ్లిపోయాడు ప్రజల్లోకి. కోట్ల రూపాయలు వచ్చే ఇక్కడే ఉండొచ్చుకదా? అంటే మా మాట కూడా వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. వాడు నంబర్ వన్ స్టార్. వాడిని అంటారా? వాడిని తిడతారా? వాడిని విమర్శిస్తారా? విమర్శించండి. పొలిటికల్ గా… వ్యక్తిగతంగా విమర్శిస్తారా?” అంటూ విరుచుకుపడ్డారు. తప్పు చేయని మనిషి ఎవరూ ఉండరని, వ్యక్తిగతంగా ఎవరిని తవ్వినా దొరుకుతారని, కావాల్సింది అది కాదని అన్నారు. పవన్ నిశ్శబ్దాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు. విమర్శలు చేస్తున్న వారి వెనక ఎవరున్నారో తమకు తెలుసునని, అందరి దూల తీరుస్తాడని అన్నారు. అతి త్వరలోనే ఇది జరుగుతుందని చెప్పారు. ఇకపై దీన్ని అనవసరమైన రాద్దాంతం చేయకండి అని నాగబాబు అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here