తెలుగు సినీ పరిశ్రమలో ఆడపిల్లలను ఎలా చూసుకుంటున్నామో చెప్పిన నాగార్జున..!

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పలువురు ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నెగిటివ్ గా చెప్పే వాళ్ళే ఎక్కువ అయిపోయారు కానీ ఒక్కరు కూడా మంచి గురించి మాట్లాడేవాళ్ళే లేరు. అయితే ‘మహానటి’ ఆడియో విడుదలకు వచ్చిన అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో అమ్మాయిలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో చెప్పారు.

నాగార్జున మాట్లాడుతూ… “ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి పేర్లు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. వారు లేకపోతే మాయాబజార్‌ లాంటి ఎన్నో అద్భుత సినిమాలు ఉండేవి కావని అన్నారు. మూగ మనసులు, డాక్టర్‌ చక్రవర్తి, మిస్సమ్మ లాంటి ఎన్నో సినిమాలు తనకు చాలా ఇష్టమని అన్నారు. ఇంకో విషయమేంటంటే.. నాకు ఎనిమిది నెలల వయసులో సావిత్రి గారు నన్ను ఎత్తుకుని సినీ రంగానికి పరిచయం చేశారు.. ‘వెలుగు నీడలు’ సినిమాలో. దాంతో ఆమె స్టార్‌డమ్‌ నాకు కూడా కొద్దిగా వచ్చింది. ఒక వ్యక్తిపై బయోపిక్‌ తీయాలంటే ఆ వ్యక్తికి ఓ అర్హత ఉండాలి, ఆ అర్హత సావిత్రిగారికి ఉంది. ఇది తెలుగు సినీచరిత్రలో మొదటి బయోపిక్. ఒక స్త్రీకే ఆ అర్హత దక్కింది.. అలాగే, ఈ సినిమాకు పనిచేసిన 20 మంది టెక్నిషియన్లు ఆడపిల్లలేనట.. ఆ వేదికను కూడా ఆడపిల్లలే వేశారట. తెలుగు సినీ పరిశ్రమలో ఆడపిల్లలకి అంతటి గౌరవం ఇస్తున్నాము” అని అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరినీ తక్కువ చేసి చూడమని నాగార్జున చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here