ఆ ఇద్దరు దూరమయ్యారు.. హరికృష్ణను తలుచుకొని.. నాగార్జున ఉద్వేగం

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్‌, పి.డి.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. గత నెల నా మనసుకు దగ్గరైన ఇద్దరూ వదలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య. ఎవరినైనా నేను అన్నా!.. అని పిలుస్తాను అంటే తననే. మా బాధ్య, బంధం మీకు చెప్పుకోలేను. ఆయన వెళ్లిపోయిన రోజు.. నా పుట్టినరోజు. పొద్దున నిద్ర లేవగానే తెలిసిన న్యూస్‌. ఎలా కనెక్ట్‌ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.

అలాగే మా ఆత్మీయుడు, అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి గారు కొద్దిరోజుల క్రితం మరణించారు. ఆయన మా నుంచి దూరం కావడంతో చాలా మిస్‌ అవుతున్నాం. మాకు సంబంధించి ఏ ఫంక్షన్‌ ఉన్నా ఆయన ముందుండేవారు. ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలి. నాన్న గారి దగ్గరనుంచి రవీందర్ రెడ్డి మా ఫ్యామిలీకి అభిమానిగా ఉన్నారు. నేను సినిమాల్లోకి వస్తున్నాను అంటే మొదట కంగ్రాట్స్ చెప్పింది ఆయనే అని నాగ్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణించడంతో ఇటీవలే వారి ఫ్యామిలీని కూడా కలిశానని నాగ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here