శ్రీదేవి మరణం గురించి మాట్లాడిన నాగార్జున..!

అతిలోక సుందరి శ్రీదేవి మరణించిందని ఆమె అభిమానులే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆమెతో పని చేసిన వాళ్ళు ఎలా మరచిపోగలుగుతారు చెప్పండి. ఆమెకు, ఆమె కుటుంబానికి టాలీవుడ్ లో ఉన్న మిత్రులలో నాగార్జున కూడా ఒకరు.. ఆయన శ్రీదేవి మరణంపై మాట్లాడారు. తాను నటించినంత కాలం శ్రీదేవి గుర్తుకు వస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

శ్రీదేవి మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆమె మరణం తనకు జీవిత పాఠం నేర్పిందని నాగార్జున అన్నారు. శ్రీదేవి హఠాన్మరణం తనలో వ్యక్తిగతంగా మార్పు తీసుకొచ్చిందని, తనకు ప్రియమైన వారిని మరింత ప్రశంసించేలా, వారికి ఇంకా దగ్గరయ్యేలా చేసిందని చెప్పారు. ‘గోవిందా గోవింద’ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు కెమెరా ముందు శ్రీదేవి చాలా సంతోషంగా ఉండేవారని, కెమెరా స్విచ్చాఫ్ చేస్తే ఆమె తన నిజజీవితంలోకి వచ్చేసే వారని నాగార్జున చెప్పారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమలలో నటిగా ఒకే రకమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను మాటల్లో చెప్పలేమని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here