‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని’ అంటూ వర్మకు ట్వీట్ చేసిన నాగ్..!

శ్రీదేవి మరణ వార్త తెలిసినప్పటి నుండి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనలోని బాధను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. శ్రీదేవిని తీసుకుపోయిన ఆ దేవుడిని తిట్టాడు కూడానూ.. గత మూడు రోజులుగా వర్మ బాధలోనే ఉన్నాడని తెలుస్తోంది. శ్రీదేవి మరణవార్త తెలిసిన తర్వాత ఆర్జీవీ తన కొత్త సినిమా టైటిల్ కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయడం కూడా ఆపేశారు.

ఈ సందర్భంలో కొంత సానుకూలత కోసం తన కొత్త సినిమా టైటిట్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, విడుదల తేదీని విడుదల చేస్తున్నానంటూ రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు. ఆ సినిమా హీరో నాగార్జున.. వర్మ ట్వీట్ పై స్పందిస్తూ… మీ ఉద్దేశం నాకు తెలుసు రామ్ గోపాల్ వర్మ అని పేర్కొన్నారు. ఈ సమయంలో తాను ఓ పాటలోని ఓ లైనుని గుర్తు చేస్తున్నానని ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని’ అని ట్వీట్‌ చేశారు.

నాగార్జున, ఆర్జీవీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ‘ఆఫీసర్’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. రివాల్వర్ తో షూట్ చేస్తూ నాగార్జున చాలా సీరియస్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ సినిమాను మే 25వ తేదీన విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here