అప్పుడు బొద్దుగా..ఇప్పుడు క్యూట్‌గా! ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?

హైద‌రాబాద్‌: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న న‌టిని అంత ఈజీగా గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే. ఎప్పుడో 2009లో వ‌చ్చిన ఓయ్ మూవీ త‌రువాత తెర‌మ‌రుగైపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ తెర మీదికి వ‌చ్చింది. ఆమే షామిలి. తాజాగా `అమ్మ‌మ్మ‌గారిల్లు` మూవీతో త‌న సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. నాగ‌శౌర్య హీరో. సుందర్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. ఈ మూవీ టీజ‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేసింది చిత్రం యూనిట్‌.

 

స్వాజిత్ మూవీప్ బ్యాన‌ర్ కింద రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్‌ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. రావు రమేశ్‌, పోసాని కృష్ణ మురళి, సుమన్‌, షకలక శంకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. `అమ్మమ్మ ఇంటికి వెళ్తే మాత్రం తిరిగి రావాలి అనిపించదు..’ అంటూ ఈ టీజర్‌ ప్రారంభమౌతుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను చిత్రీక‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here