హైదరాబాద్ పాతబస్తీ కార్పొరేటర్ సమీనా బేగం కర్నూల్ లో చేసిన స్నేక్ డ్యాన్స్ అదుర్స్..!

హైదరాబాద్ పాతబస్తీ కార్పొరేటర్ సమీనా బేగం డ్యాన్స్ తో అదరగొట్టేశారు. ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా ఆమె కర్నూల్ కు వచ్చి డ్యాన్స్ చేయడం విశేషం.

యునానీ డాక్టర్ అలాగే కార్పొరేటర్ సమీనా బేగం నాగిన్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. కర్నూల్‌లోని యునానీ మెడికల్ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. హిందీ పాటలకు డ్యాన్స్ కూడా చేశారు. వైద్య వృత్తిని అభ్యసించిన సమీనా పాతబస్తీలోని కుర్మాగుడా కార్పొరేటర్‌గా పని చేస్తున్నారు. ఆమె చేసిన నాగినీ డ్యాన్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రముఖ యునానీ డాక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here