‘బిగ్ బాస్’ గురించి క్లారిటీ ఇచ్చిన నాని..!

కొద్ది రోజుల క్రితం తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 2’ లో నాని హోస్ట్ గా వ్యవహరిస్తారు అని వార్తలు వచ్చాయి. సీజన్‌ 1లో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా సీజన్‌ 2లో నానినే అని చెప్పారు. అయితే ఈ వార్తలపై నాని స్పందించాడు. ఇంత వరకు తన వద్దకు ఆ ప్రస్తావన రాలేదని, ఒకవేళ వస్తే చెబుతానని సమాధానం ఇచ్చాడు.

నాని డబుల్ యాక్షన్ చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా ఈనెల 12న విడుదల కాబోతోంది. అందుకు సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటూ ఉన్నాడు. మేర్లపాక గాంధీ ఈ సినిమా కథ చెప్పినప్పుడు పూర్తిగా విభిన్నంగా అనిపించిందని అన్నారు. అలాగే నాగార్జున నటించిన ‘హలో బ్రదర్‌‌’ సినిమాకు, దీనికి సంబంధం ఉండదని, ఆ సినిమాలోలా ఈ సినిమాలో కృష్ణ-అర్జున్‌లు అన్నదమ్ములు కాదని క్లారితీగా చెప్పేశాడు. ఈ సినిమాలో కృష్ణార్జునులు కలిసి యుద్ధం చేస్తారని వారు ఎవరిపై, ఎందుకు చేస్తారో థియేటర్లలో చూడండని అన్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ లు హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here