ఫస్ట్ లుక్ @న‌ర్త‌న‌శాల 

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల మెద‌టి లుక్ ని విడుద‌ల చేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్స్ క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, శివాజి రాజా, జెమిని సురేష్‌, రాఘ‌వ‌, రాకెట్ రాఘ‌వ‌, త‌దిత‌రులు హ‌జ‌ర‌య్యారు.. ఈ చిత్రానికి క్రియోటివ్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడు, చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి, చిత్ర నిర్మాత ఉష మూల్పూరి.  ఈ కార్య‌క్ర‌మం లో హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ.. @న‌ర్త‌న‌శాల చిత్రం షూటింగ్ మెత్తం పూర్తిచేశాము.. లెజెండ‌రి చిత్రం న‌ర్త‌న‌శాల పేరు ఏమాత్ర పాడుచేయ్య‌కుండా నిల‌బెట్టెలా మా చిత్రాన్ని చేశాము. అలాగే మా ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు. న‌ర్త‌న‌శాల ఫ్రెష్ లుక్ చూశారుగా అంద‌రికి న‌చ్చిందిగా.. ఇలానే మా చిత్రం కూడా అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. త్వ‌ర‌లో మ‌రింత ప్ర‌మెష‌న్ తో మీ ముందుకు వ‌స్తాము.. అన్నారు.నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ఛ‌లో చిత్రాన్ని ఎంత ఘ‌న‌విజ‌యం చేశారో మా @న‌ర్త‌నశాల ని కూడా అంత‌కు మించి విజ‌యం చేయ్యాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్ర త‌ప్ప‌కుండా అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అని అన్నారు

ద‌ర్శకుడు శ్రినివాస్ చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ, @న‌ర్త‌న‌శాల చిత్రం చాలా బాగా వ‌చ్చింది దీనికి ముఖ్య కార‌ణం మా హీరో నాగ‌శౌర్య .. పాత్ర‌లోని ఇన్‌వాల్వ్ అయ్యి చేశాడు..మెద‌టి లుక్ ని చూశారుగా ఈ చిత్రం అదే రేంజి లో వుంటుంది. ఇక మా నిర్మాత‌లు శంక‌ర్ గారు, ఉష గారు, బుజ్జి గారు వీరంతా నా ఫ్యామిలి మెంబ‌ర్స్ అని ప్ర‌త్యేఖంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలికి సినిమా అంటే ఫ్యాష‌న్ ఈ బ్యాన‌ర్ లో ఏ చిత్ర వ‌చ్చినా అది బ్లాక్‌బ‌స్ల‌ర్ ఖాయం. అని అన్నారు.

హీరోయిన్ క‌ష్మిరా మాట్లాడుతూ, శౌర్య చాలా మంచి న‌టుడు.. ఈచిత్రం అంద‌రిని ప‌ది మెట్లు ఎక్కిస్తుంది. చాలా మంచి చిత్రం తో ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. అన్నారు.

ఈ  చిత్రానికి క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం.. శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి, నిర్మాత‌.. ఉష మూల్పూరి, లైన్ ప్రోడ్యూస‌ర్‌.. బుజ్జి, సంగీతం.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్, ఎడిట‌ర్‌.. కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, త‌మ్మిరాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here