మోడీ మౌన‌ముద్ర వీడేలా చేసిన ఘ‌ట‌న‌లివి!

న్యూఢిల్లీ: యావ‌త్ భార‌త దేశంలో చ‌ర్చ‌కు దారి తీసిన‌ది, ఏక‌తాటిపైకి తీసుకొచ్చిన ఈ రెండు ఘ‌ట‌ల‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మొత్తానికి నోరు విప్పారు. ఈ రెండింటిపై ఇన్నాళ్లూ మౌనముద్ర వేసిన మోడీ.. ముప్పేట‌దాడిని ఎదుర్కొన్నారు. రాజ‌కీయ పార్టీలే కాకుండా, ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు, మేధావులు కూడా ప్ర‌ధానిని వేలెత్తి చూపారు.

 

దీనితో ఆయ‌న మౌనాన్ని వీడారు. క‌థువా, ఉన్న‌వ్ అత్యాచార ఘ‌ట‌న‌ల్లో దోషుల‌ను వ‌దిలేది లేద‌ని, వారెంత‌టి వారైనా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మోడీ హామీ ఇచ్చారు. జ‌మ్మూకాశ్మీర్‌లోని క‌థువాలో ఎనిమిదేళ్ల బాలిక‌పై జ‌రిగిన దారుణ అత్యాచారం, హ‌త్యోదంతం, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ద‌ళితురాలిపై ఉన్నౌ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగ‌ర్ చేసిన సామూహిక అత్యాచార ఘ‌ట‌న‌లపై దేశం మొత్తం స్పందించింది.

ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై మాట్లాడాల‌ని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ప‌లు రాజ‌కీయ పార్టీలు ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్త‌డంతో ఆయ‌న నోరు విప్పారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు సిగ్గు చేట‌ని అన్నారు. దోషుల‌ను వ‌ద‌ల‌బోమ‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here