గర్భవతి అయినందుకే అంత తొందరగా.. ప్రైవేట్ గా పెళ్ళి చేసుకుందా..?

సోనమ్ కపూర్ పెళ్ళి గురించి గత కొద్ది రోజులుగా తెగ చర్చించుకుంటూ ఉండగా.. ఇంతలో మరో బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా షాకింగ్ గా పెళ్ళి చేసేసుకుంది. అంత తొందరగా ఎవరికీ చెప్పకుండా నేహా ప్రైవేట్ గా ఎందుకు పెళ్ళి చేసుకుంది అన్న విషయంపై బాలీవుడ్ లో భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి.

నేహా ధూపియా.. చాలా ఇంటర్వ్యూలలో తాను సింగిల్ అని చెప్పుకుంటూ వస్తోంది. కానీ అందరికీ షాక్ ఇస్తూ యాక్టర్ అంగద్ బేడీని పెళ్ళి చేసేసుకుంది. అతడు ఆమె కనే రెండేళ్ళు చిన్నవాడు కూడా..! అయితే ఈ పెళ్ళికి ముఖ్య కారణం నేహా ధూపియా గర్భవతి అవ్వడమేనని అంటున్నారు. బాలీవుడ్ బబుల్ కు నేహా దగ్గరి స్నేహితులు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆమె గర్భవతి అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి.. అందుకే ఆమె అంత తొందరగా పెళ్ళి చేసేసుకుంది’ అని చెప్పారు. గత కొద్ది రోజులుగా నేహా ధూపియా చాలా వదులుగా ఉన్న బట్టలు వేస్తుండడంతో బాలీవుడ్ పత్రికలు ఆమె ప్రెగ్నెంట్ అని తేల్చేశాయి. ఇందుకే ఆమె పెళ్ళి చేసేసుకుందని పలువురు వ్యాఖ్యానించారు. అయితే ఈ వదంతులను నేహా ధూపియా తండ్రి ఖండించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here