నేపాల్‌లోని జ‌న‌క్‌పూర్-అయోధ్య మ‌ధ్య బ‌స్ స‌ర్వీస్‌!

సీత‌మ్మ త‌ల్లి జ‌న్మించిన పుణ్య ప్ర‌దేశం జ‌న‌క్‌పూర్‌. నేపాల్‌లో ఉంది ఈ న‌గ‌రం. ఇప్పుడా జ‌న‌క్‌పూర్ నుంచి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌కు ప్ర‌త్యేకంగా బ‌స్ స‌ర్వీస్ ఆరంభ‌మైంది. శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి ఖ‌డ్గ ప్ర‌సాద్ ఓలి ఈ బ‌స్ స‌ర్వీస్‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు.

భార‌త్‌-నేపాల్ మైత్రీ బ‌స్ సేవగా దీనికి నామక‌ర‌ణం చేశారు. సుమారు 66 మంది ప్ర‌యాణికుల‌తో శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు జ‌న‌క్‌పూర్ నుంచి బ‌య‌లుదేరిన ఈ బ‌స్సు శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు అయోధ్య‌కు చేరుకుంది. అయోధ్య‌లోని రామ్‌క‌థ పార్క్ వ‌ద్ద ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, ఆ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి రీటా బ‌హుగుణ జోషి, ఇత‌ర అధికారులు ఈ బ‌స్సుకు స్వాగ‌తం ప‌లికారు.

ప్ర‌యాణికుల‌కు గులాబీ పూల‌ను ఇచ్చి ఆహ్వానించారు. నేపాల్‌లోని జ‌న‌క్‌పూర్‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య మ‌ధ్య దూరం సుమారు 500 కిలోమీట‌ర్ల‌కు పైమాటే. ప్ర‌యాణ సమ‌యం సుమారు 11 గంటలు. నేపాల్‌లోని క్లిష్ట‌మైన కొండ ప్రాంతాల గుండా ఈ బ‌స్సు రాక‌పోక‌లు సాగిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here