సెక్స్ స్కాండ‌ల్‌లో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌! ఆమె ముఖ‌మే చూడ‌లేదంటోన్న బ‌న్వ‌రీలాల్

చెన్నై: త‌మిళ‌నాడులో తాజాగా వెలుగు చూసిన సెక్స్ స్కాండ‌ల్ ఉచ్చు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ మెడ‌కు చుట్టుకుంటోంది. ఈ సెక్స్ స్కాండ‌ల్ ప్ర‌ధాన సూత్ర‌ధారి అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ నిర్మ‌లాదేవి ముఖాన్ని తాను ఎప్పుడూ చూడ‌లేదంటూ బ‌న్వ‌రీలాల్ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. దీనికోసం ఆయ‌న విలేక‌రుల స‌మావేశాన్నే ఏర్పాటు చేశారు.

సాధార‌ణంగా గ‌వ‌ర్న‌ర్ స్థాయి వ్య‌క్తి విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం చాలా అరుదు. అలాంటి వ్య‌క్తి మీడియా ప్ర‌తినిధులంద‌ర్నీ పిలిచి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చిందంటే.. ఈ సెక్స్ స్కాండ‌ల్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 78 ఏళ్ల వ‌య‌స్సులో తాను సెక్స్ స్కాండ‌ల్ కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డార‌ని అన‌డంలో అర్థం లేద‌ని భ‌న్వారీలాల్ చెప్పారు.

ఓ ఛాన్స‌ల‌ర్ హోదాలో ఆయ‌న ఈ సెక్స్ స్కాండ‌ల్‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. దీనికోసం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సంతానంను నియ‌మించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతంపై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సీబీసీఐడీ ద్వారా విచార‌ణకు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐతో విచార‌ణ జ‌రిపించాలంటూ కొన్ని మ‌హిళా సంఘాలు ప‌ట్టుబ‌డుతున్నాయి.

డిగ్రీ విద్యార్థుల‌కు మార్కులు, డ‌బ్బును ఆశ‌చూపి యూనివ‌ర్శిటీ స్థాయి అధికారులతో సెక్స్‌లో పాల్గొనాలంటూ విరుధ్‌న‌గ‌ర్ జిల్లాలోని దేవాంగ్ ఆర్ట్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ నిర్మ‌లాదేవి ఒత్తిడి తీసుకొచ్చారు. ప్ర‌తిష్ఠాత్మ‌క మ‌ధురై కామ‌రాజ్ నాడ‌ర్ యూనివ‌ర్శిటీకి అనుబంధంగా ప‌నిచేసే కాలేజీ అది.

న‌లుగురు అమ్మాయిల‌ను ఎంపిక చేసిన నిర్మ‌లాదేవి.. వారితో జ‌రిపిన సెల్‌ఫోన్ సంభాష‌ణ రికార్డులు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న ఆ రాష్ట్రంలో ప్ర‌కంప‌న‌లు రేపింది. జిల్లాలోని అరుప్పుకోట్టైలో ఉన్న దేవాంగ ఆర్ట్స్‌ కళాశాలలో నిర్మ‌లాదేవి అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేన్నారు.

ఈ క‌ళాశాల‌లో సుమారు మూడువేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థినుల‌కు మార్కులు ఆశ‌పెట్టి, డ‌బ్బ‌లు ఆశ‌చూపి యూనివర్శిటీ అధికారుల వ‌ద్దకు పంపించేలా ఏర్పాట్లు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు నిర్మ‌లాదేవి. యూనివ‌ర్శిటీ అధికారుల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని, వారు చెప్పిన‌ట్టు చేయాల‌ని, మంచి మార్కులు వేస్తానంటూ ఆశ పెట్టింది.

ఈ మేర‌కు తాను ఎంపిక చేసిన కొంద‌రు విద్యార్థినుల‌తో సెల్ ఫోన్ ద్వారా సంభాషించారు.. అధికారుల వ‌ద్ద‌కు వెళ్ల‌క‌పోతే- ఫెయిల్ చేస్తానంటూ బెదిరించారు. త‌మ‌కు అలాంటి ప‌నులు ఇష్టం లేవంటూ విద్యార్థినులు చెబుతున్న‌ప్ప‌టికీ.. ఆమె వినిపించుకోలేదు.

త్వ‌ర‌లో ప్రాక్టిక‌ల్స్ వ‌స్తాయ‌ని, తాను చెప్పిన‌ట్టు అధికారుల వ‌ద్ద‌కు వెళ్ల‌క‌పోతే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తాన‌ని బెదిరించారు. నిర్మ‌లాదేవి త‌మ‌తో సాగించిన సంభాష‌ణ‌ను రికార్డు చేసిన విద్యార్థినులు వాటిని పోలీసుల‌కు అంద‌జేశారు. దీని ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here