‘భరత్ అనే నేను’లో కొత్తగా ఓ ఫైట్.. ఎప్పటి నుండి చూడొచ్చు అంటే..!

భరత్ అనే నేను.. మహేష్ బాబు కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా చరిత్ర సృష్టించబోతోంది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు తన అభిమానులకు బ్లాక్ బస్టర్ ప్రామిస్ ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటికే తెలుగు ప్రజలు ముఖ్యమంత్రి మహేష్ మేనియాలో ఉంటే.. ఇప్పుడు ఆ సినిమాకు మరో అదనపు హంగును జోడించనున్నారు. అదేమిటంటే ‘హోళీ’ ఫైట్..!

సినిమాలోని యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్ లో ఫైట్ అందరినీ అలరించింది. ఇప్పుడు మరో యాక్షన్ సీన్ ను జోడించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించేసుకున్నారు. హోళీ ఫైట్ అనే యాక్షన్ సీన్ ను త్వరలో సినిమాలో యాడ్ చేయబోతున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి సినిమాలో ఈ కొత్త సీన్ ను కూడా చూడవచ్చని చెబుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రెస్ మీట్ లోనే కొరటాల మాట్లాడుతూ, నిడివి కారణంగా ‘హోళీ’ ఫైటింగ్ సీన్ ఒకటి ఫైనల్ ఎడిటింగ్ లో తీసేయవలసి వచ్చిందనీ, త్వరలోనే దానిని యాడ్ చేసే అవకాశం ఉండచ్చు అని చెప్పుకొచ్చాడు. అనుకున్నట్లుగానే యాడ్ చేస్తున్నారు. కొందరు ఈ సీన్ ను చూడడానికే సినిమాకు వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here