డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరక్కుండా మందు బాబుల కొత్త తెలివితేటలు.. హైదరాబాద్ పోలీసులకు తెలీదంటారా..!

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.. హైదరాబాద్ పోలీసులు ఇటీవలి కాలంలో మందుబాబుల ఆట కట్టించడానికి చాలా చోట్ల నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ టెస్టుల్లో అడ్డంగా దొరికిపోయారు. వీకెండ్ అయితే చాలు ఫుల్ గా మందు తాగడం.. కార్లు తీసుకొని వీధుల్లోకి వెళ్ళడం. వీరిపై హైదరాబాద్ పోలీసులు నిఘా వేశారు. చాలా ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.. దొరికినోళ్ళకు కుదిరితే జరిమానాలు, వీలైతే కౌన్సెలింగ్ ఇస్తూ ఉన్నారు.

అయితే తాజాగా మందు బాబుల కొత్త తెలివితేటలు పోలీసుల ముందు బయటపడ్డాయి. పోలీసులు చెకింగ్ చేస్తున్న ప్రాంతం నుంచి తప్పించుకోవడం కోసం వాలెట్ డ్రైవర్లను వాడుకున్నారు.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పబ్బుల్లో అర్థరాత్రి వరకూ గడిపిన మందుబాబులకు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలో తనిఖీలు జరుగుతున్నాయని తెలిసింది. వెంటనే సదరు పబ్ కు చెందిన వాలెట్ డ్రైవర్ల చేతికి స్టీరింగ్ ఇచ్చి, తాము తనిఖీలను దాటేంత వరకూ దాటించమని చెప్పారు. వాలెట్ డ్రైవర్లు కూడా అలానే చేశారు.

ఇంకేముంది తప్పించుకున్నాం అనుకున్నారు. కానీ అక్కడే ఓ చిక్కొచ్చి పడింది. జూబ్లీహిల్స్ దాటగానే, బంజారాహిల్స్ ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయని తెలుసుకోలేని మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు. ముందు తనిఖీలు జరుగుతుండగా, అక్కడ పట్టుబడకుండా, తమ వద్ద పట్టుబడటం ఏంటన్న అనుమానం బంజారాహిల్స్ పోలీసులకు వచ్చింది. వెంటనే విషయం ఆరాతీస్తే, ఈ వాలెట్ డ్రైవర్ల విషయం బయటకు వచ్చింది. దీంతో మొత్తం ఆరుగురు వాలెట్ డ్రైవర్లపై కేసులు పెట్టారు పోలీసులు. డబ్బులకు కక్కుర్తిపడి ఈ పని చేశామని వాలెట్ డ్రైవర్లు అంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here