1,50,000 గోవులను చంపేయబోతున్న అక్కడి ప్రభుత్వం..!

న్యూజిలాండ్ ప్రభుత్వం 1,50,000 గోవులను చంపేయడానికి నిర్ణయం తీసుకుంది. అందుకు ముఖ్య కారణం.. గోవుల ద్వారా ఓ వైరస్ వ్యాపిస్తోందని..! అక్కడి రాజకీయ నాయకులు, మిల్క్ ఇండస్ట్రీ పెద్దలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం నాడు ప్రకటించారు. దీని వలన కొన్ని కోట్ల రూపాయల డబ్బులు నష్టం కలుగుతుందని.. అయితే ‘మైకోప్లాస్మా బోవిస్’ వైరస్ సమూలంగా నాశనం చేసినట్లు అవుతామని వారు తెలిపారు.

గత జులైలో మైకోప్లాస్మా బోవిస్ వైరస్ ఆవులకు సోకిందని న్యూజిలాండ్ లో తొలిసారిగా గుర్తించారు. మొదట యూరప్, అమెరికా దేశాల్లో ఉన్న ఈ వైరస్ న్యూజిలాండ్ కు చేరింది. ఈ వైరస్ వలన న్యూమోనియా, ఆర్థరైటిస్.. మరికొన్ని రోగాలు సోకే అవకాశం ఉంది. దీని వలన అక్కడ ప్రొడక్షన్ లాస్ జరిగే అవకాశం ఉందని.. అందుకే ఈ పని చేయబోతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

న్యూజిలాండ్ లో ఉన్న అన్ని ఫామ్ లలో ఈ బ్యాక్టీరియా బారిన పడ్డ ఆవులను గుర్తించామని.. వాటన్నిటినీ చంపబోతున్నామని అధికారులు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వాటిని బీఫ్ కోసం ఉపయోగిస్తామని.. మిగిలిన వాటిని ప్రభుత్వం చెప్పిన ప్రాంతంలో పాతిపెట్టబోతున్నామని అధికారులు స్పష్టం చేశారు. రైతులు ఇందుకు నిరాకరించినా కూడా వాటిని చంపేసే అధికారం ప్రభుత్వానికి ఉందట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here