మూడునెల‌ల కింద‌టే పెళ్ల‌యిన వ‌ధువు..ఇలా!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడునెల‌ల కింద‌టే పెళ్ల‌యిన ఓ వ‌ధువు ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆమె ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. అద‌న‌పు క‌ట్నం వేధింపుల వ‌ల్లే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి.

ఒడిశాలోని బార్‌ఘ‌ర్ జిల్లా బిజేపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని బాడిప‌ల్లిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మృతురాలి పేరు గాయ‌త్రి. పెళ్లి స‌మ‌యానికి వారు అడిగినంత క‌ట్నం ఇచ్చామ‌ని, ఆ త‌రువాత కూడా ల‌క్ష రూపాయ‌లు తీసుకుని రావాలంటూ గాయ‌త్రి మ‌ల‌య్‌ను హింసించే వార‌ని త‌ల్లిదండ్రులు, సోద‌రుడు ఆరోపిస్తున్నారు.

డ‌బ్బులు తీసుకుని రాలేద‌న్న ఆగ్ర‌హంతో అత్తింటి వారే గాయ‌త్రిని చంపి, ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించార‌ని చెబుతున్నారు. బిజేపూర్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here