పెళ్ళికి చేసిన చిన్న అప్పు.. చివరికి కొత్త పెళ్ళి కొడుకు ప్రాణాలను..!

చిన్న చిన్న అప్పులు కూడా కట్టలేక ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. వారిలో 25 సంవత్సరాల జలాలుద్దీన్ అనే యువకుడు కూడా ఉన్నాడు. అతడు చనిపోడానికి కారణం 20 వేల రూపాయలు అప్పు కట్టలేకపోవడమే.. అది కూడా పెళ్ళి సమయంలో వంటవాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఆ డబ్బులు కట్టలేకపోతున్నా అన్న అవమానంతో జలాలుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా పెళ్ళి అయి కొన్ని నెలలే అయింది.

కంచన్‌ బాగ్‌ డివిజన్‌ గులాం ముస్తఫానగర్‌ లో ఈ దారుణం చోటుచేసుకుంది. జలాలుద్దీన్‌ బుక్‌ బైండర్‌ గా జీవనం సాగిస్తున్నాడు. గత మార్చిలో జలాలుద్దీన్ వివాహం జరిగింది. పెళ్లిలో వంట చేసిన వ్యక్తికి 20 వేల రూపాయలు అప్పు తీర్చాల్సి ఉంది. అతడు జలాలుద్దీన్ ని ఎప్పుడు ఇస్తావ్.. ఎప్పుడు ఇస్తావ్ అని అడుగుతూ ఉన్నాడు. ఇన్ని రోజులూ జలాలుద్దీన్ తప్పించుకొని తిరుగుతూ ఉండగా.. నిన్న సాయంత్రం ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు. జలాలుద్దీన్ ఇంట్లోనే ఉన్నప్పటికీ బెడ్ రూంలోకి వెళ్లిపోయి దాక్కొన్నాడు. ఇంట్లో వారితో లేడని చెప్పించాడు. దీంతో ఆ వ్యక్తి ఫోన్ చేయడంతో తాను ఇంటి వద్ద లేనని, హయత్ నగర్ లో ఉన్నానని సమాధానమిచ్చాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం నువ్వొచ్చేవరకు మీ ఇంట్లోనే ఉంటానని సమాధానమిచ్చాడు. లోపలే ఉన్న జలాలుద్దీన్ ఏం చెయ్యాలో పాలుపోక, బెడ్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంట్లో దాక్కున్నానని తెలిస్తే ఎక్కడ గొడవ చేస్తాడోనన్న భయంతోనే జలాలుద్దీన్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here