ఫిబ్ర‌వ‌రి 8న ప్రేమ వివాహం..జూన్ 4న‌!

తాను ప్రేమించిన యువ‌కుడిని పెళ్లి చేసుకున్న నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిందా యువ‌తి. ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృత‌దేహం ల‌భించింది. అద‌న‌పు క‌ట్నం కోసం భ‌ర్త‌, అత్తామామలే త‌మ కుమార్తెను హ‌త్య‌చేసి, ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న క‌డ‌ప‌జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో చోటు చేసుకుంది.

జ‌మ్మ‌ల‌మ‌డుగు ప‌ట్ట‌ణానికి చెందిన న‌యామ‌త్ కుమార్తె మాబుచాన్ ఓ ప్రైవేట్‌ కాలేజిలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ప‌ట్ట‌ణానికే చెందిన బాషా మొహిద్దీన్ కుమారుడు ఇంతియాజ్ ఆమెను ప్రేమించాడు. ఈ విష‌యం ఇంతియాజ్ తండ్రికి తెలిసింది. ప్రేమ‌, పెళ్లి వ‌ద్దంటూ ఆయ‌న త‌న కుమారుడిని హెచ్చ‌రించారు. అప్ప‌టికే మాబుచాన్ కూడా అతణ్ని ప్రేమించింది.

ఇద్ద‌రూ పారిపోయే ప్రయత్నం చేయడంతో తల్లిదండ్రులు ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదిన వీరికి వివాహం జరిపించారు. క‌ట్నం కింద పది తులాల బంగారం, నగదును ఇచ్చారు. వివాహం చేసుకున్నప్పటినుంచి తమ కుమార్తెను వేధించడంతోపాటు అదనపు కట్నం తీసుకుని రావాలంటూ భర్త ఇంతియాజ్, మామ బాషామొహిద్దీన్, అత్త హబీబూన్‌లే మాబూచాన్‌కు కొట్టడంతో పాటు కట్నం తీసుకుని రావాలంటూ ఇంటికి పంపించేవారు.

దీనితో మాబుచాన్ తల్లిదండ్రులు అదనంగా మరో 50 వేల రూపాయల‌ను ఇంతియాజ్‌కు ఇచ్చారు. ఇంకా కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఇంకా డ‌బ్బును తీసుకుని రావ‌డం త‌న వ‌ల్ల కాద‌ని ఆమె చెప్పారు. దీనితో వారు ఆమెను తీవ్రంగా కొట్టారు. అదే రోజు రాత్రి మాబూచాన్ ఉరి వేసుకుని క‌నిపించారు. భర్త ఇంతియాజ్, మామ అత్త హత్య చేసి ఆమెను ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి తండ్రి న‌యామ‌త్ జ‌మ్మ‌ల‌మ‌డుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here