టీవీ9 ర‌విప్ర‌కాశ్‌, న‌టుడు శివాజీ చెట్టాప‌ట్టాల్‌! ఫొటోలు వైర‌ల్‌!

టీవీ9 చీఫ్ ర‌విప్ర‌కాశ్‌, హీరో శివాజీలు చెట్టాప‌ట్టాల్ వేసుకుని చ‌క్క‌ర్లు కొడుతున్న కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో తీసిన‌ట్టుగా చెబుతున్నారు. కొద్దిరోజుల కింద‌టే వారు న్యూయార్క్ వెళ్లార‌ని, ఈ సంద‌ర్భంగా ఈ ఫొటోలున తీశార‌ని అంటున్నారు.

స్థ‌లం ఎక్క‌డిదో స‌రిగ్గా తెలియ‌ట్లేదు గానీ.. న్యూయార్క్ విమానాశ్ర‌యం లేదా షాపింగ్ మాల్ అయి ఉంటుంద‌ని చెబుతున్నారు. ర‌విప్ర‌కాశ్‌, శివాజీ ఉల్లాసంగా మాట్లాడుకోవ‌డం ఈ ఫొటోలో క‌నిపిస్తోంది. ఇటీవ‌లే ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో న‌టుడు తెర మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆప‌రేష‌న్ గ‌రుడ విష‌యంలో ఆయ‌న బీజేపీపై విమ‌ర్శ‌లు చేశారు.

ఈ విష‌యంలో- టీవీ9 శివాజీపై ఎక్స్‌క్లూజివ్‌గా క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేసింది.  శివాజీ పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నార‌ని, టీవీ9 కూడా ఆ పార్టీకే బాహ‌టంగా మ‌ద్ద‌తు ఇస్తోందంటూ ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోప‌ణ‌లకు ఈ ఫొటోలు బ‌లాన్ని ఇచ్చిన‌ట్ట‌యింద‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here