ఏకంగా శ్రీదేవి బాత్ టబ్ వరకూ వెళ్ళిన మీడియా.. బాత్ రూమ్ లోకే వెళ్ళిన యాంకర్..!

ఏదైనా ఒక సెన్సేషన్ జరిగితే అది మీడియాకు చాలా ఇంపార్టెంట్.. ఎందుకంటే తమ ఛానల్ కు మంచి టీఆర్పీ వస్తుందని.. ప్రేక్షకులు తమ ఛానల్ నే చూస్తూ ఉండాలని వారి ఆకాంక్ష..! కానీ కొన్ని కొన్ని సార్లు మీడియా చేసే అతి అంతా ఇంతా కాదు.. ఆ విషయంలో భారత్ మీడియా ఎప్పుడో హద్దులు దాటిపోయింది. గతంలో నేపాల్ లో భూకంపం సమయంలో కూడా అంతే.. వారు అవస్థలు పడుతూ ఉంటే మన వాళ్ళు మైక్ లు వాళ్ళ మూతుల వద్ద పెట్టారు. చివరికి అక్కడి వాళ్ళు మన మీడియాను అక్కడి నుండి వెళ్ళిపోమనే దాకా వచ్చింది. భారత్ కు చెడ్డ పేరు కూడా తీసుకొని వచ్చింది.

అయితే ఇప్పుడు శ్రీదేవి విషయంలో కొన్ని మీడియా సంస్థలు, టీవీ ఛానల్స్, కొందరు యాంకర్లు చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. ఆదివారం నాడు శ్రీదేవి మృతి చెందడానికి కారణం హార్ట్ అటాక్ అని తెలిపారు. దీంతో ఆమె సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు.. ఇప్పుడు ఉన్న సెలెబ్రిటీలతో ఆమెకు ఉన్న సత్సంబంధాల విషయమై కొన్ని వీడియోలు.. ఆడియోలు చూపించారు.

కానీ ఒక్క రోజులో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించిందని బయటకు వచ్చిందో.. టీవీ ఛానల్స్ టీఆర్పీ కోసం ఏది పడితే అది చేస్తున్నాయి. కొందరు అయితే బాత్ టబ్ లో శ్రీదేవి ఫోటోను వేసి.. ఆ బాత్ టబ్ దగ్గరకు బోనీ కపూర్ వెళ్ళినట్లు ఎడిటింగ్ చేసిన ఫోటోలు వేసి.. నానా రచ్చ చేస్తున్నారు. కొందరు యాంకర్లు.. తమ విలేకర్లను ఓ బాత్ రూమ్ లోకి పంపించి.. బాత్ టబ్ లో కూర్చోపెట్టి విశ్లేషణలు ఇప్పించారు. ఈ విషయాలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

ఇక సోషల్ మీడియాలో అయితే టీవీ ఛానల్స్ ను విపరీతంగా తిడుతున్నారు. ఎలా పడితే అలా విశ్లేషణలు అందించడానికి మీరు ఎవరు అని ఏకిపడేస్తున్నారు నెటిజన్లు.. ‘చనిపోయింది శ్రీదేవి మాత్రమే కాదని.. భారత్ లో మీడియా కూడా’ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here