మ‌క్కా మ‌సీదు పేలుళ్ల కేసు: జ‌డ్జి రాజీనామా ఏమైందంటే..!

హైద‌రాబాద్‌: జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌వీంద‌ర్ రెడ్డి రాజీనామా ప‌త్రాన్ని హైకోర్టు ఆమోదించ‌లేదు. హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఈ రాజీనామా ప‌త్రానికి ఆమోద‌ముద్ర వేయ‌లేదు. పాత‌బ‌స్తీలోని మ‌క్కా మ‌సీదు బాంబు పేలుళ్ల కేసును కొట్టి వేసిన త‌రువాత జ‌స్టిస్ ర‌వీంద‌ర్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

రాజీనామా ప‌త్రాన్ని హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి పంపించారు. ఈ పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న అయిదుమందిని నిర్దోషులుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

మ‌ధ్యాహ్నం త‌న తీర్పును వెల్ల‌డించిన ఆయ‌న సాయంత్రానికి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించ‌క‌పోతే- 15 రోజుల పాటు సెల‌వు ఇవ్వాల‌ని హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని కోరుతాన‌ని అప్ప‌ట్లో ర‌వీంద‌ర్ రెడ్డి చెప్పారు. ఆయ‌న‌కు సెల‌వు ఇచ్చారా? లేదా? అనేది ఇంకా తెలియ‌రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here