రోహిత్ శర్మ ఎట్టకేలకు ఆడాడు.. భారత్ ఫైనల్ చేరింది..!

ఎట్టకేలకు భారత బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ బ్యాట్ తో సమాధానం చెప్పాడు. నిదహాస్ ట్రోఫీ టీ20 సిరీస్‌లో టీమిండియాను ఫైనల్‌కి చేర్చాడు. రోహిత్ శర్మ 61 బంతుల్లో 89 పరుగులు చేసి రాణించగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (3/22) అద్భుత ప్రదర్శన చేయడంతో బంగ్లాదేశ్‌ని 17 పరుగుల తేడాతో భారత్ చిత్తుగా ఓడించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. రోహిత్ శర్మ, సురేశ్ రైనా (47: 30 బంతుల్లో 5×4, 2×6) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముష్ఫికర్ రహీమ్ (72 నాటౌట్: 55 బంతుల్లో 8×4, 1×6) చివరి వరకూ ఒంటరి పోరాటం చేసినా బంగ్లాదేశ్‌ని గెలిపించలేకపోయాడు.

భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో ఆ జట్టు చివరికి 159/6కే పరిమితమైంది. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది. ఇక లీగ్ దశ చివరి మ్యాచ్ శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు  భారత్ తో  ఫైనల్ లో తలబడనుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here