పవన్ కళ్యాణ్ ‘పులి’ హీరోయిన్ ప్రభుదేవాని పెళ్ళి చేసుకోబోతోందని న్యూస్..!

పవన్ కళ్యాణ్ ‘పులి'(కొమురం పులి) సినిమా హీరోయిన్.. తెలుగు ప్రజలు అంత ఈజీగా మరచిపోలేరు. సినిమా హిట్ అయి ఉండి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదనుకోండి. టాప్ హీరోయిన్ అయితే కాలేకపోయింది కానీ.. సినిమా అవకాశాలు మాత్రం ఆమెకు వస్తూనే ఉన్నాయి.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటిస్తూ ఉంది నికీషా పటేల్..! అయితే ఈ అమ్మడు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాను పెళ్ళి చేసుకోబోతోంది అని సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ మరింత పెద్దది అయ్యే లోగా.. నికీషా పటేల్ వివరణ ఇచ్చింది. తాను ప్రభుదేవానే కాదు ఎవరినీ పెళ్ళి చేసుకోవడం లేదని చెప్పింది.


తాను ప్రభుదేవానే కాదు, ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదని ప్రముఖ నటి నికీషా పటేల్ స్పష్టం చేసింది. ఈ విషయమై నికీషా పటేల్ తన పీఆర్వో ద్వారా స్పష్టత నిచ్చారు. వార్తా పత్రికలు ఏవేవో రాస్తున్నాయని, ఈ వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తనకు ఉందని చెప్పింది. ఆ వదంతుల్లో ఎలాంటి నిజం లేదని, ప్రభుదేవా తనకు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి మాత్రమేనని, ప్రభుదేవాను ‘సార్’ అని తాను పిలుస్తానని స్పష్టం చేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here