కేరళకు వెళ్ళి వచ్చిన హైదరాబాదీ.. భాగ్యనగరంలో ఇద్దరికి నిఫా వైరస్..?

తెలుగు రాష్ట్రాలు కట్టడి చేయాలని అనుకున్న నిఫా వైరస్ హైదరాబాద్ కు కూడా వ్యాపించింది. హైదరాబాద్ లో ఇద్దరికి ఈ వైరస్ సోకిందని వైద్యులు ధృవీకరించారు. కేరళకు వెళ్లి వచ్చిన ఓ హైదరాబాదీకి, ఇంకో వ్యక్తికి  నిఫా వైరస్ సోకినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. వీరి రక్త నమూనాలను పుణెలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కే రమేష్‌ రెడ్డి తెలిపారు.


నిఫా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తి కేరళకు వెళ్లి వచ్చాడని, అయితే, వైరస్ ఉన్న ప్రాంతానికి ఆయన చాలా దూరంలోనే ఉన్నారని, వ్యాధి నిర్దారణకే రక్త నమూనాలు తీసుకున్నామని, పాజిటివ్ గా తేలే అవకాశం తక్కువేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. హాస్పిటల్స్ లో డాక్టర్ల కోసం ప్రొటెక్టివ్ సూట్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే, ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. తాము ఇప్పటికే కేరళలో నిఫా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ఎన్సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) అధికారులతో చర్చించామని తెలిపారు. చెట్ల నుంచి రాలిపడిన, పక్షులు కొరికిన పండ్లను తినకుండా ఉండాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here