కేరళ అయిపోయింది.. కర్ణాటకకు సోకిన నిపా వైరస్..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిపా వైరస్ గురించి తెగ భయపడిపోతున్నారు. ఇప్పటికే అంతు చిక్కని ఈ వ్యాధికి చికిత్స ఏమిటో తెలీక అందరూ భయపడిపోతున్నారు. ఈ దశలో ఇప్పుడు కేరళను దాటి కర్ణాటకకు వ్యాపించింది ఈ నిపా వైరస్.

కర్నాటకలో ఇద్దరికి ఈ వ్యాధి సోకినట్టు వైద్యలు నిర్దారించారు. వారికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నామని, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. కర్ణాటక రాష్టం గదగ్ జిల్లా రోణా తాలూకలోని జిన్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి నిపా వైరస్ లక్షణాలతో చేరాడు. అయిదు నెలల క్రితం కేరళ రాష్ట్రం లోని క్యాలికట్ లో పని చేసి ఈ మధ్యనే అక్కడికి వచ్చాడు. ఒక వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉండడంతో అతడిని వైద్యులు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అతడి బ్లడ్ శాంపుల్స్ పూణే ఎన్.ఐ.వి. ల్యాబ్ కు పంపించారు. తర్వాతి 48 గంటల్లో ఈ విషయం పై పూర్తీ స్పష్టత రానుంది. రాయచూరులో కూడా ఒక వ్యక్తికి ఈ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ వైరస్ కర్ణాటక దాటి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉండటంతో, సరిహద్దు జిల్లాల కలెక్టర్లను, అధికారులను కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి. జ్వరం వచ్చి, నాలుగైదు రోజులుగా తగ్గకుంటే, వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here