సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్.. హైదరాబాద్ లోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు నో ఎంట్రీ..!

ఎప్పుడు పడితే అప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇవ్వవు.. ఉదయం 8 గంటలలోపు కానీ.. రాత్రి 9 గంటల తరువాత మాత్రమే నగరంలోకి వచ్చేకి అనుమతి ఉండేది. అయితే ఇకపై అది కూడా లేకుండా చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ సిటీలో కాకుండా ఊరి చివర మాత్రమే ప్రైవేట్ బస్సులు ఉండాలని తీర్మానించారు. హైదరాబాద్ నగరం లోపలికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు ఎంట్రీని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ లో పెరిగిపోతున్న ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే చర్యల్లో భాగంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దీంతో ఆర్టీయే అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని సూచించాయి. నిబంధనలను అతిక్రమించి, నగరంలోకి ప్రవేశిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేకాకుండా బస్సులను సీజ్ చేసి, గుర్తింపును రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. కాగా, ప్రస్తుతం ఉదయం 8 గంటలలోపు, రాత్రి 9 గంటల తరువాత నగరంలోకి ప్రైవేటు బస్సులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఉదయం 8 గంటలలోపు గమ్యస్థానాలకు చేరిపోతుండగా, రాత్రి 9 గంటల తరువాత శివార్లలోని బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నాయి. సర్కారు తాజా నిర్ణయంతో విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు ఎల్బీ నగర్, కర్నూలు వైపు నుంచి వచ్చే బస్సులు అత్తాపూర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాల్సి వుంటుంది. అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల్లోనో, క్యాబ్ లను తీసుకుని రావడమో చేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here