హెల్మెట్ లేదా? పూజ‌లు చేయం! డిసైడ్ చేసిన అర్చ‌కులు

కొత్త‌గా టూ వీల‌ర్ కొంటాం. కొన్న వెంట‌నే ముందుగా తీసుకెళ్లేది గుడికే. నేరుగా అర్చ‌కుల‌ను క‌లిసి టూవీల‌ర్‌కు పూజ చేయాల‌ని కోరతాం. అందుకు స‌రేనంటూ ఆయ‌న ఓ చిన్న‌పాటి లిస్ట్ ఇస్తే.. అందులో ఉన్న వ‌స్తువుల‌న్నీ తీసుకెళ్తాం.

బండికి పూజ చేయించి..ఝామ్మంటూ షికార్లు కొడ‌తాం. ఇది రోజూ జ‌రిగే వ్య‌వ‌హార‌మే. ఆ రాష్ట్రంలో మాత్రం ఇది చెల్ల‌దు. ఎందుకంటే.. పూజ కోసం కొత్త‌బండిని తీసుకెళ్లిన‌ప్పుడు వెంట హెల్మెట్ కూడా ఉండాలి.

లేక‌పోతే..స్వాములోరు ఊరుకోరు. పూజ‌లు చెయ్య‌రు. ఎంత అడిగితే.. అంత ఇస్తామ‌న్నా వారు అంగీక‌రించారు. వీలైతే శపించేస్తారు. రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణాల సంఖ్య‌ను త‌గ్గించ‌డానికే తామంతా ఈ నిర్ణ‌యం తీసుకున్నామంటూ చెబుతారు.

ఒడిశాలోని జ‌గ‌త్‌సింగ్‌పూర్‌, పూరి, కేంద్ర‌పారా వంటి జిల్లాల్లో సంక్రాంతి నుంచి సాగుతున్న తీరు ఇది. సంక్రాంతి సీజ‌న్ మూడు రోజుల్లోనే ఒక్క జ‌గ‌త్‌సింగ్‌పూర్ జిల్లాలో మొత్తం 13,203 ద్విచ‌క్ర వాహ‌నాలు అమ్ముడ‌య్యాయి.

వారంద‌రూ త‌మ వాహ‌నాన్ని గుడికి తీసుకెళ్ల‌గా.. హెల్మెట్ ఉన్న చూపించిన వారికి మాత్ర‌మే పూజ‌లు చేశారు అర్చ‌కులు. ఎంత డ‌బ్బు ఇస్తామ‌ని చెప్పినా.. అంగీక‌రించ‌లేదు.

త‌మ‌కు ఇచ్చే లంచం మొత్తంతో ఓ హెల్మెట్ కొనుక్కోవ‌చ్చుగా అంటూ స‌ల‌హాలు ఇస్తున్నారు. ఫ‌లితంగా.. ఈ మూడురోజుల్లో హెల్మెట్ల అమ్మ‌కాలు చెప్పుకోద‌గ్గ స్థాయిలో పెరిగాయ‌ట‌. మంచి డెసిష‌న్ క‌దా!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here