ఈ ద్వీపంలో కాలు పెడితే బ్రతకలేరు.. అందుకే ఎవరికీ ఎంట్రీ లేదు..!

మనం చూడని.. మనకు తెలియని.. ఎన్నో వింతలూ విశేషాలు ఈ ప్రపంచంలో దాగి ఉన్నాయి. అలాంటిదే ఈ ద్వీపం కూడా ఈ ద్వీపంలో ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు. కనీసం అక్కడ కొద్ది సేపు ఆపడానికి కూడా నావికులు ఎంతగానో భయపడతారు. ఇంతకూ ఏంటా దీవి..? ఏముంది ఆ దీవిలో అని డౌట్ ఉందా.. మరైతే తెలుసుకోండి..!

బ్రెజిల్ దేశానికి చెందిన ద్వీపం ఒకటి ఉంది. దాని పేరు ‘ఇలా డా క్విమాడా గ్రాండే’ (Ilha da Queimada Grande). ఈ ద్వీపం లో మనుషులు ఎవరూ కాలు పెట్టడానికి వీలు లేదు. అలాగే దీని చుట్టుపక్కల ఉండడానికి కూడా అధికారులు ఒప్పుకోరు. అట్లాంటిక్ మహా సముద్రంలో బ్రెజిల్ నగరమైన సావో పాలోకు 90 మైళ్ళ దూరంలో ఈ ద్వీపం ఉంది.

ఇక్కడ కాలు పెట్టనివ్వకపోవడానికి ముఖ్య కారణం అక్కడ ఉన్న పాములు. గోల్డెన్ లాన్స్ హెడ్ జాతికి చెందిన పాములు ప్రపంచంలోనే ప్రమాదకరమైన వాటి లిస్టులో ఉన్నాయి. అలాంటి గోల్డెన్ లాన్స్ హెడ్ పాములు ఏకంగా 4.5లక్షలకు పైగా ఆ ద్వీపంలో ఉన్నాయి. ఆ ద్వీపం లోని ఒక్కో స్క్వేయర్ మీటర్ లోనూ ఒక్కో పాము ఉంటుంది. అక్కడ ఒక వేళ ఆ పాములు కాటు వేస్తే బ్రతకడం కష్టం.. అలాగే అక్కడి నుండి ఆసుపత్రికి చేరుకోవడం కూడా చాలా చాలా కష్టమైన పని..! అందుకే ఈ ద్వీపంలో కాలుపెట్టకూడదని బ్రెజిల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here