సుధీర్ తో నిజం పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చిన రష్మి..!

‘అహనా పెళ్ళంట’ ఈ ఉగాదికి మల్లెమాల టీమ్ నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఎక్కువగా టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కు కట్ చేసిన ప్రోమోలు అలాంటివి.. యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ ప్రేమలో ఉన్నారని గతంలో రూమర్స్ వచ్చాయి.. వస్తున్నాయి కూడానూ.. దీన్ని బేస్ చేసుకొని మల్లెమాల టీమ్.. రష్మీ, సుధీర్ ల పెళ్ళి చేస్తున్నట్లు ప్రోమోలను విడుదల చేసింది. ప్రోగ్రామ్ పూర్తయ్యాక రష్మీకి ఎక్కువగా మెసేజీలు వచ్చేశాయి.. నిజంగా సుధీర్ ను ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నావు అని రష్మీని అడిగేశారు కూడానూ..!

ఈ నేపథ్యంలో ” మీరు నిజంగానే సుధీర్ ని పెళ్లి చేసుకున్నారా .. లేదా? .. ఈ విషయంలో మాకు క్లారిటీ కావాలి” అనే ప్రశ్నను ఒక అభిమాని ట్విట్టర్లో రష్మిని అడిగేశాడు. దాంతో “క్రమం తప్పకుండా ఈ షోను చివరి వరకూ చూడండి .. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది” అంటూ రష్మి సమాధానం ఇచ్చేసింది. ఇక షోను కూడా నవ్వుకోడానికి డిజైన్ చేశారు తప్పితే మరేదీ లేదని తేలిపోయింది. చాలా మంది మాత్రం నిజంగా పెళ్ళి చేసుకోవచ్చు కదా అని అడిగేస్తున్నారు. అంతేకాకుండా తమ వద్ద ఎలాంటి రిలేషన్ షిప్ లేదని వారిద్దరూ ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here