అజ్ఞాతవాసి ప్రీమియర్ షోలు లేనట్లే.. డబ్బులు వాపస్ ఇవ్వనున్న సినిమా థియేటర్లు..!

ఒక్కో చోట ఒక్కో పరిస్థితి.. అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ విషయంలో నెలకొంది. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండడంతో ప్రీమియర్ షోలు అంటూ తెగ సందడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ షోల కోసం పర్మిషన్లు ఇచ్చేసినప్పటికీ.. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అజ్ఞాతవాసి సినిమాకు ప్రీమియర్ షో టికెట్లు అమ్మిన థియేటర్లకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ప్రీమియం షోలకు టికెట్లు విక్రయించిన హైదరాబాద్ లోని పలు థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. కూకట్ పల్లిలో ఉండే ప్రముఖ జంట థియేటర్లు భ్రమరాంబ, మల్లికార్జున ముందుగానే ప్రీమియర్ షో టికెట్లను విక్రయించగా, వాటన్నింటినీ క్యాన్సిల్ చేసి, ప్రేక్షకుల డబ్బులను వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించారు. ఇదే తరహాలో ప్రీమియర్ షోలకు ప్లాన్ వేసిన థియేటర్లన్నింటికీ నోటీసులు పంపారు. ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి లేదని చెబుతూ, నిబంధనలు ఉల్లంఘిస్తే, థియేటర్ లైసెన్స్ ల రద్దు సహా క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు.

ఎలాగైనా ప్రీమియర్ షోలకు అనుమతి సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఉన్న చిత్ర యూనిట్, ఈ సాయంత్రంలోగా తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరినట్టుగా తెలుస్తోంది. చూద్దాం అజ్ఞాతవాసి తెలంగాణలో కూడా ప్రీమియం షోలు సంపాదిస్తాడో లేక ఎప్పటిలాగే షోలను నడిపిస్తారేమో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here