ఈ విమానాన్ని ఎవరో మర్చిపోయారు..!

ఎప్పుడైనా కానీ.. సైకిల్ మర్చిపోవడం, బైక్ మర్చిపోవడం, కారు మర్చిపోవడం లాంటి ఘటనలు మనం చూసే ఉంటాం. కానీ విమానం మర్చిపోవడం ఎప్పుడైనా చూశారా.. అలాంటిదే జరిగింది ఇండోనేషియాలో..! బాలి దగ్గర ఉన్న విశాలమైన మైదానంలో బోయింగ్ 737 విమానం చాలా రోజులుగా పడి ఉంది. ఇప్పుడు ఆ విమానాన్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉన్నారు.

రాయ నుస దువా సెలటన్ హైవేకు దగ్గరగా ఫేమస్ బీచ్ అయిన పండ్వా బీచ్ కు అయిదు నిమిషాల ప్రయాణ దూరంలో ఈ విమానం ఉంది. దీని చుట్టూ షిప్పింగ్ కంటైనర్లు కూడా చాలా పడి ఉన్నాయి. అయితే ఆ విమానం అక్కడకు ఎప్పుడు వచ్చిందో.. ఎవరు తెచ్చారో అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. గతంలో ఎవరో ఆ విమానంలో రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారని.. కానీ ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టడంతో అది కాస్తా తుప్పు పట్టిపోయింది. ప్రభుత్వం వద్ద కూడా ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు కూడా లేవు. ఈ విషయం మీడియాలో కూడా రావడంతో విమానాన్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉన్నారు. దీంతో అక్కడే సెక్యూరిటీని ఏర్పాటు చేసి చూసుకోవాలి అనుకున్నోళ్ళు చూడండి అంటూ బోర్డులు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here