ఎన్నారై పెళ్ళికొడుకా.. ఇకపై అలా చేశావంటే ఇక్కడ ఉన్న ఆస్థులు పోగొట్టుకుంటావు..!

విదేశాల్లో ఉన్న అబ్బాయిలకు అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తే వారు సుఖంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు అమ్మాయిల తల్లిదండ్రులు. అందరూ కాదు కానీ కొందరు మాత్రం పెళ్ళి అయిన తర్వాత కట్న కానుకలు తీసుకొని భార్యలను పట్టించుకోకుండా ఉంటారు. వారు విదేశాల్లోనే దర్జాగా బ్రతుకుతూ ఉంటారు. అమ్మాయి మాత్రం ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇకపై అమ్మాయిలను వదిలించుకోవాలని తప్పించుకుని తిరిగే ఎన్నారైలు ఆస్థులు పోగొట్టుకునే అవకాశం ఉంది.

పెళ్ళి చేసుకుని మోసం చేసే ఎన్నారై యువకుల మీద భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. భారత ప్రభుత్వం భార్యలను మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్న ఎన్నారై భర్తల ఆస్థులను జప్తు చేసే ఆలోచనలో ఉంది. మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మనేకా గాంధీ మాట్లాడుతూ.. భార్యలను మోసం చేసి విదేశాలకు చెక్కేస్తున్న భర్తల ఆటకట్టించడానికి తాము ప్రత్యేకంగా క్రిమినల్ లా లో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నామని తెలిపారు.

ఇలా మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయిన భర్తలకు మూడు సమన్లు పంపుతారట.. అయితే వాటికి కానీ స్పందించకుండా ఉన్నారంటే భారతదేశంలో ఉన్న వాళ్ళ ఆస్థులను జప్తు చేసి.. బాధితులకు న్యాయం జరిగేలా చూడనున్నారు. గత మూడేళ్ళలో ఇలాంటి కేసులు ఏకంగా 3,328 వచ్చాయట. అందుకోసమే భారతప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకోవాలని అనుకుంటూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here