చాలా రోజుల త‌రువాత ద‌క్షిణాఫ్రికా నుంచి స్వ‌దేశానికి వ‌చ్చిన మ‌హిళ‌! రైలులో అదృశ్యం!

ముంబై: చాలా రోజుల త‌రువాత స్వ‌దేశానికి వ‌చ్చిన ఓ ఎన్నారై మ‌హిళ అదృశ్యం అయ్యారు. ముంబై నుంచి భువ‌నేశ్వ‌ర్‌కు రైలులో బ‌య‌లుదేరిన ఆమె త‌న గ‌మ్య‌స్థానానికి చేరుకోలేదు. మ‌ధ్య‌లోనే మాయం అయ్యారు. ఆమె పేరు దేవిక‌మ్మ పిళ్లై. కొన్నేళ్లుగా ఆమె ద‌క్షిణాఫ్రికా నుంచి ముంబైకి వ‌చ్చారు.

అనంత‌రం భువ‌నేశ్వ‌ర్ వెళ్ల‌డానికి లోక‌మాన్య తిల‌క్ టెర్మిన‌స్‌లో రైలు ఎక్కారు. ఆ త‌రువాత ఆమె క‌నిపించ‌లేదు. త‌న గ‌మ్య‌స్థానానికి చేరుకోలేదు. సెలవులు గడపడానికి నెలరోజుల కింద‌టే ఆమె ముంబైకి వ‌చ్చారు. ముంబై ద‌క్షిణ ప్రాంతంలోని కొలాబ‌లో ఆమెకు ఓ గెస్ట్ హౌస్ ఉంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఆమె అక్క‌డే ఉంటున్నారు.

భువ‌నేశ్వ‌ర్‌లో త‌న స‌న్నిహితుల‌ను కలుసుకోవ‌డానికి వెళ్తున్న‌ట్టు ఫిబ్రవరి 23వ తేదీన రైలులో వెళ్లార‌ని, అప్ప‌టి నుంచి ఆచూకీ తెలియ‌కుండా పోయార‌ని దేవిక‌మ్మ పిళ్లై కుమార్తె రైల్వే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా ఆమె మహారాష్ట్రలోని గోండిగావ్ వ‌ద్ద ఉన్నట్లు ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా గుర్తించామ‌ని పోలీసులు వెల్లడించారు. ఆమె కుమార్తె ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here