వైసీపీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్..!

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. అలాగని ఇతర పార్టీల ఫ్లెక్సీల్లో ఆయన బొమ్మ వేసుకుంటే గొడవలు జరిగిపోతాయి. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకమిడి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఫ్లెక్సీని స్థానిక వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీకి అటూ, ఇటూ ఎన్టీఆర్, వైయస్సార్ ఉండగా మధ్యలో జగన్, అబ్బయ్య, కొడాలి నాని ఫొటోలు ఉన్నాయి.


వైసీపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటో ఉండటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటో ఉండటం ఏమిటని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీ దగ్గరకు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు. చింపేయడానికి కొందరు ప్రయత్నించడంతో అది కాస్తా ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇరు వర్గాలను వారించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఫ్లెక్సీని స్థానిక వైసీపీ కన్వీనర్ అబ్బయ్య తో పోలీసులు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీకి అటూ, ఇటూ ఎన్టీఆర్, వైయస్సార్ ఉండగా మధ్యలో జగన్, అబ్బయ్య, కొడాలి నాని ఫొటోలు ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో జరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here