ఎన్టీఆర్ మ‌రోసారి చొక్కా విప్పాడు..! త్రివిక్ర‌మ్ మ‌రోసారి `అ` సెంటిమెంట్‌!

జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న తాజా చిత్రానికి `అర‌వింద స‌మేత‌..` అనే పేరు పెట్టారు. వీర రాఘ‌వ అనేది దీని ట్యాగ్‌లైన్‌గా చెప్పుకోవ‌చ్చు. అర‌వింద అనేది హీరోయిన్ క్యారెక్ట‌ర్ పేరు. వీర రాఘ‌వ అనేది హీరో క్యారెక్ట‌ర్ నేమ్‌. అర‌వింద‌గా పూజా హెగ్డే న‌టిస్తోంది. హారికా హాసిని బ్యాన‌ర్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌కుడు. త్రివిక్ర‌మ్ మ‌రోసారి `అ` సెంటిమెంట్‌పై ఆధార‌ప‌డ్డారు.

అఆ, అజ్ఞాత‌వాసి త‌రువాత మ‌రోసారి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న `అ` మూవీ ఇది. ఈ సినిమా టైటిల్ లోగో ఒక్క‌టే ఆవిష్క‌రించారు. టెక్నీషియ‌న్స్ ఏమిట‌న్నేది ఫ‌స్ట్‌లుక్‌లో ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. ఈ సినిమా కోసం మ‌రోసారి ఎన్టీఆర్ చొక్కా విప్పిన‌ట్ట‌యింది. గ‌తంలో ఆయ‌న టెంప‌ర్ కోసం చొక్కా విప్పారు. సిక్స్ ప్యాక్ ప్ర‌ద‌ర్శించారు. మ‌ళ్లీ.. అ కోసం మ‌రోసారి టాప్‌లెస్‌గా క‌నిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here