హే.. ఎన్టీఆర్ బాగా మారిపోయాడే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల్లో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో.. మరొకటి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో మల్టీ స్టారర్..! అది మొదలవ్వక ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పూర్తీ చేయాలని భావిస్తూ ఉన్నాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందనున్న చిత్రంలో ఎన్టీఆర్ ను స్లిమ్ లుక్ లో చూపించాలని దర్శకుడు భావించాడు. అందుకోసమే ఎన్టీఆర్ బరువు తగ్గడానికి వర్కౌట్లు మొదలుపెట్టాడు. అనుకున్నట్లుగానే ఇప్పుడు ఎన్టీఆర్ కు సంబంధించిన స్లిమ్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఈ ఫోటోలలో నవ్వుతూ కనిపించిన తారక్ కొంచెం సన్నబడినట్లు అనిపిస్తోంది. ఎక్కువగా జిమ్ వర్కౌట్స్ చేస్తున్నాడట. హృతిక్ రోషన్ – రన్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ హీరోలకు ఫిట్ నెస్ లో ట్రైనింగ్ ఇచ్చిన ఎల్.స్టీవెన్ అనే ట్రైనర్ ఆధ్వర్యంలో చిన్న ఎన్టీఆర్ వ్యాయామం చేస్తున్నాడు. అందుకు తగ్గట్టే ప్రతిఫలం కూడా కనబడుతోంది. ఏది ఏమైనా మన హీరోలు కథ డిమాండ్ చేస్తే చాలు ఏది చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here