సిగరెట్ తాగేవాళ్ళకు ఈ వీడియో చూపించండి.. ఆ తర్వాత తాగడానికి ధైర్యం చేయగలరా..!

సిగరెట్ తాగకండి.. తాగకండి అని ఎన్ని సార్లు చెప్పినా కొందరు వినరు.. వారికి కూడా తెలుసు అది ప్రమాదమే అని కానీ.. వినిపించుకోరు. అయితే ఇక్కడ ఉన్న ఓ వీడియో ఆ సిగరెట్ తాగేవాళ్ళకు చూపించండి. ఇది చూసి కూడా మారకపోతే మనం ఏమీ చేయలేము..!

అమండా ఎల్లర్.. నార్త్ కాలిఫోర్నియాకు చెందిన ఓ నర్స్.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. అందులో రెండు ఊపిరితిత్తులను ఉంచింది. ఒకటి సాధారణమైనది కాగా.. మరొకటి సిగరెట్ తాగిన వ్యక్తిది. ఒకటి ఎరుపుగా.. బాగా ఆరోగ్యవంతంగా కనిపిస్తే.. మరొకటి 20 ఏళ్ళుగా రోజుకొక సిగరెట్ ప్యాకెట్ తాగే వ్యక్తికి సంబంధించింది. వాటిని చూస్తేనే మనకు అర్థం అవుతోంది సిగరెట్ ఎంత ప్రమాదకరమైనదో.. నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ లు శరీరం లోకి వెళితే ఎంత ప్రమాదమో ఇదొక్క ఉదాహరణ చాలు. స్మోకింగ్ అన్నది ఆక్సిజన్ ను శరీరభాగాలకు.. ముఖ్యంగా చర్మానికి చేరనివ్వకుండా చేస్తుంది. అలాగే ఒక్క కార్బన్ మోనాక్సైడ్ మాత్రమే కాకుండా 4000 ఇతర కెమికల్స్ కూడా శరీరం లోకి చొచ్చుకొని వెళ్తాయి. భారతదేశంలో కూడా ఏటా కొన్ని లక్షల మంది ఈ ధూమపానం వలన చనిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here