`ఐ మిస్ యు ప‌ప్పా, ఐ మిస్ యు మ‌మ్మీ..` అంటూ డెత్‌నోట్‌! త‌ల్లిదండ్ర‌లేం చెబుతున్నారంటే!

ఐ మిస్ యు ప‌ప్పా, ఐ మిస్ యు మ‌మ్మీ అని డెత్‌నోట్ రాసి ఓ న‌ర్సింగ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. బెంగ‌ళూరు శివార్ల‌లోని నెల‌మంగ‌ల తాలూకా ప‌రిధిలో ఉన్న బేగూరులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మృతురాలి పేరు మౌనిషి రామ్. 20 సంవ‌త్స‌రాల ఆ యువ‌తి స్థానికంగా అంబికా న‌ర్సింగ్ క‌ళాశాల‌లో డిప్లొమా చేస్తున్నారు. జ‌న్మ‌తః ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన మౌనిషి రామ్ త‌ల్లిదండ్రులు కొంత‌కాలంగా బేగూరులో నివ‌సిస్తున్నారు.

గ‌త ఏడాదే ఆమె న‌ర్సింగ్ క‌ళాశాల‌లో చేరారు. ప‌శ్చిమ బెంగాల్‌కే చెందిన ఓ యువ‌కుడిని ఆమె ప్రేమిస్తున్నారు. అత‌నితో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ విష‌యం ఇంట్లో తెలిసింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్రేమ పెళ్లికి అంగీక‌రించేది లేదంటూ త‌ల్లిదండ్రులు తేల్చేశారు. దీనితో ఆమె ఆత్మ‌హ‌త్య ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఆమె రాసిన‌ట్టుగా చెబుతున్న ఓ డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

త‌ల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి అంగీక‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు రాసి ఉంది. ఆమె త‌ల్లిదండ్రుల వాద‌న వేరుగా ఉంది. త‌మ కుమార్తె ఆత్మ‌హ‌త్య చేసుకునేంత‌టి పిరికిది కాద‌ని వాదిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై నెల‌మంగ‌ల రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here