క‌ట్టెల కోసం అడ‌వికి వెళ్లిన వారికి..చెట్టుకు వేలాడుతూ!

క‌ట్టెల కోస అడ‌వికి వెళ్లిన తెల్ల‌వారు జామునే అడ‌వికి వెళ్లిన కొంద‌రు గ్రామస్తుల‌కు రెండు మృత‌దేహాలు చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో వేలాడుతూ క‌నిపించాయి. వాటిని చూడ‌గానే ఆ గ్రామ‌స్తుల నిద్ర‌మ‌త్తు ఎగిరిపోయింది. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘ‌ట‌న ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుల‌ను- జిల్లాలోని ధ‌ర్మ‌శాల పోలీస్‌స్టేషన్ ప‌రిధిలో ఉన్న పాయిక‌రాపూర్ గ్రామానికి చెందిన బాపి స‌మ‌ల్‌, పూజా మ‌ల్లిక్‌గా గుర్తించారు. పాయిక‌రాపూర్‌కే చెందిన వారిద్ద‌రూ ప్రేమికులు.

 

త‌మ పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల వారు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి వారిద్ద‌రూ క‌నిపించ‌ట్లేద‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. తెల్ల‌వారేస‌రికి గ్రామ శివార్ల‌లోని అడ‌వుల్లో చెట్టుకు ఇలా వేలాడుతూ క‌నిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here