ఫారెస్ట్ బీట్ ఆఫీస్‌లో..ఫ్యాన్‌కు వేలాడుతూ!

ఫారెస్ట్ గార్డు ఒక‌రు త‌న కార్యాల‌యంలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని ఢెంక‌నాల్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడిని త‌ప‌న్‌దాస్‌గా గుర్తించారు. జిల్లాలోని గ‌డ‌శిల ఫారెస్ట్ బీట్ ఆఫీస్‌లో గార్డ్‌గా ప‌నిచేస్తున్నారు.

ఫారెస్ట్ బీట్ ఆఫీస్ కార్యాల‌యం తెర‌వ‌క పోవ‌డంతో స్థానికులకు అనుమానం వ‌చ్చింది. ఈ విష‌యాన్ని వారు పోలీసుల‌కు తెలిపారు. దీనితో ఢెంక‌నాల్ స‌ద‌ర్ పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

ఆఫీస్ లోప‌లి నుంచి గ‌డియ‌పెట్టి ఉండ‌టంతో త‌లుపుల‌ను ప‌గుల‌గొట్టి లోనికి వెళ్లారు. కార్యాల‌యంలో ఫ్యాన్‌కు వేలాడుతూ త‌ప‌న్‌దాస్ మృత‌దేహం క‌నిపించింది.

ఇది హ‌త్యేన‌ని మృతుడి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here