గ్యాంగ్‌రేప్‌న‌కు గురైన బాలిక‌..రెండు నెల‌లు ఆసుప‌త్రిలో..ఇంటికి రాగానే!

ఒడిశాలో సంచ‌ల‌నం రేపిన గిరిజ‌న మైన‌ర్‌ బాలిక సామూహిక అత్యాచారం కేసు అనూహ్య మ‌లుపు తిరిగింది. బాధిత బాలిక సోమ‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఒడిశా కోరాపుట్ జిల్లాలోని కుండులి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

తొమ్మిదవ త‌ర‌గ‌తి చ‌దువుతున్న గిరిజ‌న మైన‌ర్ బాలిక రెండు నెల‌ల కింద‌ట స్వ‌గ్రామంలోనే దారుణంగా సామూహిక అత్యాచారానికి గుర‌య్యారు. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల వేష‌ధార‌ణ‌లో ఉన్న న‌లుగురు వ్య‌క్తులు ఆమెను బ‌లాత్క‌రించారు.

వారు సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌కు చెందిన వారా? కాదా? అనే అంశంపై న్యాయ విచార‌ణ కొన‌సాగుతోంది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 10వ తేదీన మార్కెట్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా.. ఆ న‌లుగురు వ్య‌క్తులూ ఆమెను అప‌హ‌రించారు.

స‌మీప అట‌వీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌నతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాధిత బాలిక రెండు నెల‌ల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందారు.

కొద్దిరోజుల కింద‌టే ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వ‌హిస్తోన్న బీఎస్ఎఫ్ లేదా సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలకు చెందిన జ‌వాన్లు ఆమెపై అత్యాచారం చేసి ఉంటారంటూ అప్ప‌ట్లో ఆందోళ‌న‌లు చెలరేగాయి.

ఈ ఘ‌ట‌న‌పై బిజూ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం న్యాయ విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ విచార‌ణ కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే బాధిత బాలిక ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here