క‌థువా కంటే ఘోరం: అత్యాచారానికి గురైన ఆ ఆరేళ్ల బాలిక ఇక లేదు..!

భువ‌నేశ్వ‌ర్‌: దేశాన్ని కుదిపేసిన క‌థువా ఘ‌ట‌న‌ను మించిన దారుణ ఉదంతం విషాదంత‌మైంది. అత్యాచారానికి గురై, అప‌స్మార‌క స్థితిలో స్థానికుల‌కు క‌నిపించిన ఆరేళ్ల బాలిక‌.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసింది. ఒడిశాలోని క‌ట‌క్ జిల్లా స‌లీపూర్‌లో ఈ దారుణ ఘ‌ట‌న ఎనిమిదిరోజుల కింద‌ట చోటు చేసుకుంది.

క‌ట‌క్‌లోని శ్రీ‌రామ‌చంద్ర బాంజా వైద్య క‌ళాశాల‌, ఆసుప‌త్రిలో ఎనిమిదిరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ బాలిక ఆదివారం సాయంత్రం మ‌ర‌ణించింది. ఈ నెల 21వ తేదీన రాత్రి స‌లీపూర్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఆ బాలిక అప‌స్మార‌క స్థితిలో స్థానికుల‌కు క‌నిపించింది. వెంట‌నే ఆ బాలిక‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఐసీయులో ఉంచి చికిత్స అందించారు.

ఆసుప‌త్రిలో చేర్చిన త‌రువాత ఆ బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. మూసిన క‌న్ను తెర‌వ‌లేదు. ఆ క‌న్ను ఇక శాశ్వ‌తంగా మూత‌ప‌డింది. బాలిక దారుణ అత్యాచారానికి గురైన‌ట్టు డాక్ట‌ర్లు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌హ‌మ్మ‌ద్ ముస్తాక్ అనే యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు.

సంఘ‌ట‌న చోటు చేసుకున్న రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు చాకొలెట్ కొనుక్కోవ‌డానికి ఆ బాలిక ద‌గ్గ‌ర్లోనే ఉన్న దుకాణానికి వెళ్లింది. స‌మయం గ‌డుస్తున్న‌ప్ప‌టికీ.. త‌మ కుమార్తె ఇంటికి రాక‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గురైన త‌ల్లిదండ్రులు చుట్టుప‌క్కల వెత‌క‌గా.. ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో అప‌స్మ‌రాక స్థితిలో క‌నిపించిందా చిన్నారి. చాకొలెట్ ఆశ చూపి ముస్తాక్ ఆ బాలిక‌పై అత్యాచారం చేసిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here