ఒంట‌రి మ‌హిళ‌పై అమానుషం..!

భువ‌నేశ్వ‌ర్‌: మ‌హిళ‌కు మ‌త్తుమందు ఇచ్చి, ఆమె స్పృహ కోల్పోయిన త‌రువాత అత్యాచారం చేసి, ఆ ఘాతుకాన్ని వీడియో తీసిన ఘ‌ట‌న ఒడిశాలోని భువనేశ్వ‌ర్ జిల్లా ఝార్‌పాడాలో చోటు చేసుకుంది. ఆ దారుణానికి పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పేరు స‌రోజ్ దాస్‌. స్థానికంగా ఉండే ఆల‌యంలో పూజారి. కుదువ వ్యాపారం కూడా చేస్తుంటాడు.

డ‌బ్బులు అవ‌స‌ర‌మైన ఓ మ‌హిళ‌.. త‌న న‌గ‌ల‌ను తాక‌ట్టు పెట్ట‌డానికి రెండురోజుల కింద‌ట స‌రోజ్‌దాస్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో.. ఆమెకు మంచినీటిలో మ‌త్తు మందు క‌లిపి ఇచ్చాడు. దాన్ని తాగిన బాధితురాలు స్పృహ త‌ప్పగా.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ కిరాత‌కాన్ని త‌న వీడియోలో బంధించాడు. మెళ‌కువ వ‌చ్చిన త‌రువాత ఆమెకు చూపించాడు. దాన్ని అడ్డుగా పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయ‌సాగాడు.

ఆమె లొంగ‌క‌పోవ‌డంతో.. వాటిని ఇంట‌ర్‌నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. త‌న వీడియోలు అశ్లీల‌క‌ర వెబ్‌సైట్ల‌లో క‌నిపించిన విష‌యం తెలుసుకున్న బాధితురాలు నేరుగా భువ‌నేశ్వ‌ర్ మ‌హిళా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. త‌న‌పై కేసు న‌మోదైన విష‌యాన్ని తెలుసుకున్న వెంట‌నే స‌రోజ్ దాస్ ప‌రార‌య్యాడు. పోలీసులు అత‌ని కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here