స్కూల్ విద్యార్థులు హాజ‌రైన నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో అశ్లీల భంగిమ‌లతో చెల‌రేగిన క‌ళాకారులు

జైపూర్‌: చిన్న పిల్ల‌లు హాజ‌రైన ఓ ర‌ష్యాన్ బ్యాలె షో అది. అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే.. ర‌ష్యాకు చెందిన కొంద‌రు క‌ళాకారులు ప్ర‌ద‌ర్శిస్తోన్న నాట‌కం. రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌క జ‌వ‌హ‌ర్ క‌ళాకేంద్ర‌లో ఆ ప్ర‌ద‌ర్శ‌నను ఏర్పాటు చేశారు. ఓపెన్ ఎయిర్ థియేట‌ర్ అది.హైద‌రాబాద్‌లో ఉన్న తెలుగు ల‌లిత క‌ళాతోర‌ణం వంటిద‌న్న మాట‌. సుమారు 200కు పైగా విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజ‌ర‌య్యారు.

 

వారంతా ప‌దో త‌ర‌గ‌తి లోపు విద్యార్థులే. ఈ నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను తిలకించ‌డానికి ప‌లు విద్యాసంస్థ‌లు త‌మ స్కూల్ బ‌స్సుల‌ను కూడా ఏర్పాటు చేశాయి. అలాంటి షోలో అశ్లీల స‌న్నివేశాలు, అస‌భ్య‌క‌ర భంగిమ‌లతో హోరెత్తించారు క‌ళాకారులు. పోర్న్ క్లిప్‌ల‌ల్లో క‌నిపించే భంగిమ‌లను ప్ర‌ద‌ర్శించారు.

200 మందికి పైగా విద్యార్థులు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది, మీడియా ప్ర‌తినిధులు హాజ‌రైన ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో అలాంటి భంగిమ‌లతో క‌ళాకారులు చెల‌రేగిపోవ‌డం అంద‌ర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ప‌లువురు ఉపాధ్యాయులు విద్యార్థుల క‌ళ్ల‌ను మూసి, బయ‌టికి తీసుకెళ్లారు. దీనిపై రాజ‌స్థాన్ విద్యాశాఖ‌, సాంస్కృతిక శాఖ‌ల‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆ శాఖ‌లు విచార‌ణ‌కు ఆదేశించాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here