ఆ సెలెబ్రిటీ ఒక్క ట్వీట్ చేసింది.. 8300 కోట్లు కంపెనీ నష్టపోయింది..!

శంకర్ ‘ఐ’ సినిమా చూశారా.. అందులో మోడల్ గా ఉన్న విక్రమ్.. ఇకపై ఒక కూల్ డ్రింక్ యాడ్ చేయనని చెబుతాడు.. దీంతో ఆ కూల్ డ్రింక్ షేర్లు, వ్యాపారం బాగా దెబ్బతింటుంది. సెలెబ్రిటీ మాటలకు ఉండే పవర్ అలాంటిది అని శంకర్ ఆ ఒక్క సీన్ తో చూపించాడు. అచ్చం అలాంటిదే.. ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్ చాట్ విషయంలో చోటుచేసుకుంది. ఇంతకూ ఆ సెలెబ్రిటీ ఎవరు అని అనుకుంటూ ఉన్నారా.. రియాలిటీ స్టార్ కైలీ జెన్నర్..! ఒకే ఒక్క ట్వీట్ తో స్నాప్ చాట్ మార్కెట్ విలువను 1.3 బిలియన్ డాలర్ల మేర కరిగించేసింది. అంటే భారత కరెన్సీలో 8300 కోట్ల రూపాయలు.

ఏమైందో ఏమో కానీ.. ఇక మీదట తాను స్నాప్ చాట్ ను వాడనంటూ కైలీ జెన్నర్ ట్వీట్ చేసింది. గురువారం ఈ ట్వీట్ చేయగా స్పాన్ చాట్ పేరెంట్ కంపెనీ స్నాప్ ఐ.ఎన్.సీ. మార్కెట్ విలువ 1.3 బిలియన్ డాలర్లు పడిపోయింది. స్నాప్ ఐ.ఎన్.సీ. షేరు ధర ఆరు శాతానికి పైగా పతనమైపోయింది. అయితే, తాను ఇప్పటికీ స్నాప్ ను ప్రేమిస్తున్నట్టు ఆమె తర్వాత మరో ట్వీట్ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కైలీ జెన్నర్ కు ఇటీవలే ఓ పిల్లాడు పుట్టడంతో తన సోషల్ మీడియా అకౌంట్లలో అప్డేట్లు ఇస్తూ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here