డ్రాప్ చేస్తానంటే..కారెక్కిన నేపాలీ యువ‌తి: నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లిన‌ డ్రైవ‌ర్

క్యాబ్ డ్రైవ‌ర్లు ఖాళీ స‌మ‌యాల్లో త‌మ కార్ల‌ను డ్రాపింగ్ కోసం వినియోగిస్తుంటారు. ఆ కారు వెళ్లే దారిలోనే వెళ్లాల్సిన వారు ప‌దో, ఇర‌వ‌య్యో ఇచ్చి తమ గ‌మ్య‌స్థానానికి చేరుతుంటారు. ఇది అన్నిచోట్లా జ‌రిగేదే.

ఆ స‌మ‌యంలో కొంద‌రు డ్రైవ‌ర్లు త‌మ కీచ‌క‌త్వాన్ని బ‌య‌ట‌పెడుతుంటారు. ఒంట‌రి మ‌హిళ‌లు కారు ఎక్కితే ఇబ్బందుల‌కు గురి చేస్తుంటారు. బెంగ‌ళూరులోనూ ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. య‌ల‌హంక‌కు వెళ్ల‌డానికి హెబ్బాళ వ‌ద్ద ఓ క్యాబ్ ఎక్కిందో నేపాలీ యువ‌తి. నిజానికి అది ఓలా క్యాబ్‌. ఖాళీగా ఎందుకు వెళ్లాల‌నే ఉద్దేశంతో హెబ్బాళ నుంచి య‌ల‌హంక‌కు 20 రూపాయ‌ల‌కు బేరం మాట్లాడుకున్నాడు డ్రైవ‌ర్‌.

కారెక్కిన వెంట‌నే మ‌రెవ‌ర్నీ ఎక్కించుకోలేదు. య‌ల‌హంక‌కు బ‌దులుగా ఇంకో మార్గంలో తీసుకెళ్లాడు. నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లి లైంగిక వేధింపుల‌కు గురి చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు.

 

దీన్ని ముందే ప‌సిగ‌ట్టిన ఆ నేపాలీ యువ‌తి కారు ఆపీ, ఆప‌గానే డోరు తీసుకుని బ‌య‌ట‌ప‌డింది. గ‌ట్టిగా కేక‌లు వేసి న‌లుగురినీ పిలిచింది. అనంత‌రం హెబ్బాళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆ క్యాబ్‌డ్రైవ‌ర్ కోసం అన్వేషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here