ఓలా క్యాబ్ లో బెంగళూరు నుండి నార్త్ కొరియాకు..!

ఓలా క్యాబ్.. మనకు కావాల్సిన ప్రాంతం నుండి కోరుకున్న చోటుకు తీసుకొని వెళ్తూ ఉంటాయి. కాస్త సుదూర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళడానికి కూడా సర్వీసులు ఉండే ఉండి ఉంటాయ్.. అయితే ఏకంగా విదేశాలకు తీసుకొని వెళ్ళడానికి కూడా ఓలా సర్వీసులు అందిస్తోందా అంటే కాదనే చెబుతారు సంస్థ ప్రతినిధులు.. కానీ ఓ యువకుడు బెంగళూరు నుండి ఉత్తర కొరియాకు కారును బుక్ చేసుకొన్నాడు. దీనికి ఓలా సంస్థ కూడా ఓకే చెప్పేసి.. ఆ తర్వాత నాలుక కరచుకుంది.

బెంగళూరుకు చెందిన రోహిత్ అనే యువకుడు ఓలా యాప్ లో ఉన్న తప్పును చూపించాడు. ఓలా యాప్ ద్వారా ఏకంగా నార్త్ కొరియాకు క్యాబ్ బుక్ చేశాడు. వెళ్లాల్సిన సమయం, ధర, డ్రైవర్ పేరు.. తదితర వివరాలను వెంటనే రోహిత్‌కు పంపింది. బెంగళూరు నుంచి నార్త్ కొరియాకు రూ.1,49,088 చార్జీగా పేర్కొంది. రోహిత్ వెంటనే దీనిని స్క్రీన్‌షాట్ తీసి ‘ఓలా పనితీరు ఇలా ఉంది.. మీ క్యాబ్‌లో నార్త్ కొరియా వెళ్లడం సాధ్యమేనా? ఒకసారి చెక్ చేసుకోండి’ అని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సాంకేతిక తప్పిదంతో ఇలా జరిగిందని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్టు ఆ తర్వాత ఓలా పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here